ఇడ్లీ రవ్వ తో ఉప్మా / Idly ravva upma

హయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం ఇడ్లీ రవ్వ తో ఉప్మా తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

ఉప్మా:-

ఇడ్లీ రవ్వ తో ఉప్మా చేసుకొని చూడండి. చాలా టేస్టీ గా వెరైటీగా ఉంటుంది. ఎప్పుడు ఉప్మా రవ్వ ఉప్మా చేస్తుంటాం.

ఇడ్లీ రవ్వ ఉప్మా కొంచం పొడి పొడిగా చేసుకుంటే సూపర్ టేస్టీ గా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి.


Idly ravva upma


కావలసిన పదార్థాలు:-

ఇడ్లీ రవ్వ

నూనె

జీలకర్ర

ఆవాలు

కరివేపాకు

పచ్చిమిర్చి

అల్లం

ఎండు మిర్చి

కొత్తిమీర

మినప్పప్పు

సెనగపప్పు

టమోటో ముక్కలు

ఉల్లిపాయ ముక్కలు

నీళ్ళు

ఉప్పు

తయారు చేసే విధానం:-

ఉప్మా చేయడానికి కావలసిన పదార్థాలు అన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి.

స్టౌ వెలిగించి పాన్ లో నూనె పోసి కాగిన తరువాత అందులో జీలకర్ర ,ఎండుమిర్చి ,కరివేపాకు ,కొత్తిమీర ,అల్లం ,పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ,మినపప్పు ,ఆవాలు ,సెనగపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.

ఇవన్నీ ఫ్రై ఐన తర్వాత అందులో తగినంత ఉప్పువేసి తగినన్ని నీళ్ళు పోయాలి.

నీళ్ళు ఒక కప్పు రవ్వ కి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు మరిగిన తరువాత అందులో రవ్వ వేసి బాగా ఉండలు లేకుండా కలపాలి.

ఒక పది నిమిషాలు అయ్యాక అందులో కొద్దిగా కొత్తిమీర వేసి దించేయాలి.

అంతే రుచికరమైన ఇడ్లీ రవ్వ ఉప్మా రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

Also read: రొయ్యల వేపుడు / prawns fry

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️