తలకాయ కూర / talakaya kura / goat head curry

హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా తలకాయ కూర ఎలా చేయాలో చూద్దాం.


తలకాయ కూర:-

తలకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎముకలు గట్టిపడతాయి.దీన్ని హైదరబాద్ లో పాయ అనికూడా పిలుస్తారు. ట్రై చేయండి.


talakaya kura



కావలసిన పదార్థాలు:-


మేక తలకాయ మాంసం - అర కేజీ

ఉల్లిపాయలు - రెండు

కారం - రెండు టీస్పూన్లు

కొబ్బరి పొడి రెండు టీస్పూన్లు

ధనియాలపొడి -ఒక స్పూన్

పచ్చిమిర్చి - రెండు

పసుపు

జీలకర్ర

అల్లంవెల్లుల్లి పేస్టు - ఒకటీస్పూన్, 

లవంగాలు నాలుగు

సాజీర - అర టీస్పూన్

మిరియాలు అరటీస్పూన్

దాల్చిన చెక్క - కొద్దిగా

ధనియాలు ఒక స్పూన్

యాలకులు - నాలుగు

నూనె -సరిపడా, 

ఉప్పు - రుచికి తగినంత.

కొద్దిగా చింతపండు రసం



తయారు చేసే విధానం:-


  • స్టౌ వెలిగించి పాన్ లో లవంగాలు దాల్చిన చెక్క యాలకులు మిరియాలు ధనియాలు జీలకర్ర సజిరా వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి.

  • మసాలాలు చల్లార్చి కావలసిన విధంగా పొడి చేసి పెట్టుకోవాలి.

  • ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి.

  • ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టీ వేడి చేసుకోవాలి. వేడి అయిన తర్వాత నూనె పోసుకుని ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి తరుగు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.

  • ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్,పసుపు వేసి బాగా కలపాలి.

  • ఇప్పుడు కడిగి పెట్టుకొన్న మటన్ తలకాయ కూర ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.

  • ఒక పది నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత చింతపండు రసం పోసుకోవాలి.

  • తర్వాత కారం, ఉప్పు, మసాలా పొడి వేసుకొని కుక్కర్ మూత పెట్టీ ఎనిమిది విజిల్స్ వచ్చేవరకు ఉడికించి పెట్టుకోవాలి.

  • మూత తీసి స్టౌవ్ వెలిగించి కుక్కర్ పెట్టీ ధనియాల పొడి, కొత్తిమీర, ఎండుకొబ్బరి పొడి వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి.

  • అంతే రుచికరమైన తలకాయ కూర రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.


Also read: మటన్ బిర్యానీ / mutton biryani



0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️