హాయ్ ఫ్రెండ్స్,అందరికీ నమస్కారం. ఈరోజు మనం రుచికరమైన కాకరకాయ పులుసు తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.
కాకరకాయ పులుసు:-
కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది. అని చాలా మంది కాకరకాయ కూర తినడమే మానేస్తారు. అలాగే కాకరకాయ తో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. చేదు లేకుండా కాకరకాయ ఫ్రై, కాకరకాయ కూర, కాకరకాయ పులుసు ఇలా చాలా రకాల రెసిపీ లు తయారు చేసుకోవచ్చు .కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం తప్పకుండా ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు:-
కాకరకాయలు
చింత పండు గుజ్జు
నూనె
ఉప్పు
కారం
పసుపు
జీలకర్ర
అల్లం వెల్లుల్లి పేస్ట్
ఉల్లిపాయలు
జీలకర్ర పొడి
మెంతిపొడి
ఎండుమిర్చి
కొత్తిమీర
ఎండు కొబ్బరి పొడి
ధనియాల పొడి
తయారు చేసే విధానం:-
- ముందుగా కాకరకాయలను కడిగి గుండ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ లో నూనె పోసి కాగిన తరువాత అందులో జీలకర్ర, ఎండుమిర్చి,ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి.
- వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో కాకరకాయ ముక్కలను వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు అందులో తగినంత కారం ,ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి.
- మరో రెండు నిమిషాల తర్వాత అందులో చింత పండు గుజ్జును వేసి బాగా కలిపి ఉడికించాలి.
- చింత పండు గుజ్జు దగ్గర పడ్డ తర్వాత అందులో కొద్దిగా మెంతిపొడి, జీలకర్రపొడి, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి,కొత్తిమీర వేసి ఒక నిముషం తర్వాత దించేయాలి.
- అంతే రుచికరమైన కాకరకాయ పులుసు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: తలకాయ కూర / talakaya kura / goat head curry
Post a Comment
If you have any doubts, Please let me know.