చుక్క కూర బీరకాయ కూర / chukkakura beerakaya curry

హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం చుక్క కూర బీరకాయ కూర తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

బీరకాయ చుక్కకూర:-

బీరకాయ దీంతో చాలా వంటకాలు చేసుకోవచ్చు. బీరకాయ పప్పు,బీరకాయ కూర, బీరకాయ దోసకాయ కూర ఇలా చాలా చేసుకోవచ్చు. బీరకాయలు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి.

chukkakura beerakaya curry


కావలసిన పదార్థాలు:-

బీరకాయలు

పచ్చిమిర్చి

చుక్కకూర

జీలకర్ర

ఆవాలు

ఎండు మిర్చి

కరెపాకూ

కొత్తిమీర

వెల్లుల్లి

ఉప్పు

పసుపు

ఉల్లిపాయలు

తయారు చేసే విధానం:-

  • ముందుగా బీరకాయలు, చుక్కకూర లను కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ వెలిగించి కళాయి లో నూనె పోసి కాగిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి,కరివేపాకు వేసి వేయించుకోవాలి.
  • వేయించిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు నలగ్గొట్టి వేయాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి.
  • ఒక నిమిషం తర్వాత బీరకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి.
  • ఇప్పుడు పచ్చిమిర్చి లో సరిపడా ఉప్పు వేసి పేస్ట్ ను సిద్దం చేసుకోవాలి.తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ను కూడా వేసి బాగా వేయించుకోవాలి.
  • ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.తర్వాత చుక్క కూర వేసుకోవాలి.ఇప్పుడు మూత పెట్టీ ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత కొత్తిమీర వేసి దించేయాలి.
  • అంతే రుచికరమైన వంటకం బీరకాయ చుక్క కూర రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి.నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. షేర్ చెయ్యండి.


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️