పచ్చి బఠాణీల కూర / green peas curry

హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా పచ్చి బఠాణీల కూర ఎలా చేయాలో చూద్దాం.


బఠాణీ :-

బఠాణీలు చాట్ లో వాడుతుంటాం. అలాగే ఫ్రై కూడా చేసుకుంటాం. ఉడికించి సలాడ్ లో కూడా వేసుకుంటం. అలాగే బిర్యానీ లో కూడా వేస్తాం. బటానీలతో స్నాక్ కూడా చేసుకుంటాం.


green peas curry

 

కావలసిన పదార్థాలు:-

ఉల్లిపాయ ముక్కలు

పచ్చిమిరపకాయలు

జీలకర్ర

ఆవాలు

కారం

ఎండు కొబ్బరి తురుము

ధనియాల పొడి

కొత్తిమీర

పసుపు- తగినంత

టమోటా ముక్కలు

కరివేపాకు

ఉప్పు

నూనె

పచ్చి బఠానీలు-ఒక కప్పు


తయారు చేసే విధానం:-


  • కావలసిన పదార్థాలు అన్నీ సిద్ధం చేసి, బఠాణీలు కడిగి నానబెట్టుకోవాలి.

  • ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

  • టమోటాలను చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి.

  • తరువాత స్టా వెలిగించి గిన్నె పెట్టి నూనె పోసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. 

  • ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి.

  • ఇప్పుడు కట్ చేసి పెట్టుకొన్న టొమాటో ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.

  • టొమాటోలు మగ్గిన తరువాత అందులో ఉప్పు, కారం, వేయాలి. కొద్దిగా వేగాక పచ్చి బఠానీలు వేసి రెండు నిమిషాలు వేగాక ఒక కప్పు నీళ్ళు

  • పోసి ఉడికించాలి. 

  • కూర దగ్గరగా అయ్యాక ఎండు కొబ్బరి తురుము, ధనియాల పొడి,కొత్తిమీర వేసి దించేయాలి.

  • అంతే రుచికరమైన పచ్చి బఠాణీల కూర రెఢీ.

  • ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది చపాతీ, పూరి లోకి కూడా చాలా బాగుంటుంది.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.




0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️