మటన్ బిర్యానీ / mutton biryani

 హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా మటన్ బిర్యానీ  ఎలా చేయాలో చూద్దాం.


మటన్ బిర్యానీ :-


బిర్యానీ అంటే అందరికీ చాలా ఇష్టం ప్రత్యేకంగా ప్రత్యేకమైన సందర్భంలో బిర్యాని చేసుకుంటాం. హైదరాబాది మటన్ బిర్యానీ  అంటే అందరికీ చాలా చాలా ఇష్టం ఎప్పుడైనా ఒక్కసారైనా హైదరాబాద్ బిర్యానీ తినాలని అనుకుంటారు. బిర్యానీలో చాలా అంటే చాలా రకాలుంటాయి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ ,ఫిష్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ ఇలా చాలా రకాలు ఉంటాయి .అయితే బిర్యానీని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు. ఈరోజు నేను తయారు చేసుకునే విధంగా మటన్ బిర్యానీ మీ అందరితో షేర్ చేసుకుంటాను.

mutton biryani


కావలసిన పదార్థాలు:-


మటన్ అరకేజీ 

బాస్మతి రైస్ అర కేజీ 

పెరుగు పావు కేజీ 

నిమ్మరసం ఒక రెండు మూడు స్పూన్లు 

కారం తగినంత 

ఉప్పు తగినంత 

అల్లం వెల్లుల్లి పేస్ట్ 

ధనియాల పొడి 

గరం మసాలా 

నూనె తగినంత 

నెయ్యి రెండు స్పూన్లు 

కొత్తిమీర 

పుదీనా 

బిర్యాని ఆకు 

కావలసినన్ని నీళ్లు 

యాలకులు 

మిరియాలు 

ఇలాచి 

దాల్చిన చెక్క 

అన్ని మసాలా దినుసులు 

ఉల్లిపాయలు పావు కిలో 

పసుపు

బిర్యానీ మసాలా

పచ్చిమిరపకాయలు 

కరివేపాకు


తయారు చేసే విధానం:-


  • ముందుగా కావాల్సిన పదార్థాలు అన్నీ సిద్ధం చేసుకోవాలి .

  • బాస్మతి బియ్యాన్ని గిన్నెలో వేసుకొని రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలి.

  • ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి.

  • స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో నూనె పోసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

  • ఒక గిన్నెలో మటన్ వేసుకుని అందులో తగినంత ఉప్పు ,కారం ,ధనియాల పొడి,గరం మసాలా, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ,నూనె , నిమ్మరసం కొద్దిగా అన్నీ వేసి బాగా కలిపి మూడు గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.

  • ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నీళ్ళు పోసి వేడి చేసుకోవాలి.

  • ఆ నీళ్లలో పచ్చిమిరపకాయ ముక్కలు ,కొద్దిగా కరివేపాకు,లవంగాలు ,ఇలాచి ,బిర్యానీ ఆకు,కొద్దిగా నూనె ,తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.

  • ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి వెడల్పైన గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని వేడి చేసుకోవాలి.

  • నాన పెట్టుకున్న మటన్ లో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ సగం వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఈ మటన్ బిర్యాని చేసుకోవడానికి బిర్యానీ గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి.

  • స్టవ్ మంట తక్కువగా పెట్టుకోవాలి .ఇప్పుడు నెమ్మదిగా ఉడుకుతుంది మరొకవైపు నీళ్లు మరిగిన తర్వాత కడిగి పెట్టుకొన్న బియ్యం నీళ్లలో వేసుకుని ఉడికించుకోవాలి.

  • 50% అన్నం ఉడికిన తర్వాత బిర్యానీ గిన్నలో మటన్ పైన అన్నం ను వేసుకోవాలి. మొత్తం మటన్ పైన బాస్మతి బియ్యంతో వండిన అన్నాన్ని పరుచుకోవాలి.

  • మొత్తం వేసుకున్న తర్వాత మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ ని పైనుంచి వేసుకోవాలి .

  • అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా రెండు స్పూన్లు నెయ్యి చిటికెడంత ఫుడ్ కలర్ ని పైనుండి వేసుకోవాలి .

  • ఇప్పుడు గాలి బయటకు వెళ్లకుండా మూత పెట్టుకోవాలి. మైదాపిండి పెట్టుకొని మూసేయాలి .

  • ఇలా ఒక నలభై నిమిషాలు ఉడికించుకోవాలి.20 నిముషాలు మీడియం మంట మీద మరో 20 నిమిషాలు తక్కువ మంట పైన ఉడికించుకోవాలి .

  • అంతే గుమగుమలాడే హైదరాబాది మటన్ దమ్ బిర్యాని రెడీ. బిర్యానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.


Also read: చేపల పులుసు / fish curry



0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️