హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా పచ్చి బఠాణీల కూర ఎలా చేయాలో చూద్దాం.
బఠాణీ :-
బఠాణీలు చాట్ లో వాడుతుంటాం. అలాగే ఫ్రై కూడా చేసుకుంటాం. ఉడికించి సలాడ్ లో కూడా వేసుకుంటం. అలాగే బిర్యానీ లో కూడా వేస్తాం. బటానీలతో స్నాక్ కూడా చేసుకుంటాం.
కావలసిన పదార్థాలు:-
ఉల్లిపాయ ముక్కలు
పచ్చిమిరపకాయలు
జీలకర్ర
ఆవాలు
కారం
ఎండు కొబ్బరి తురుము
ధనియాల పొడి
కొత్తిమీర
పసుపు- తగినంత
టమోటా ముక్కలు
కరివేపాకు
ఉప్పు
నూనె
పచ్చి బఠానీలు-ఒక కప్పు
తయారు చేసే విధానం:-
కావలసిన పదార్థాలు అన్నీ సిద్ధం చేసి, బఠాణీలు కడిగి నానబెట్టుకోవాలి.
ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
టమోటాలను చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
తరువాత స్టా వెలిగించి గిన్నె పెట్టి నూనె పోసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.
ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి.
ఇప్పుడు కట్ చేసి పెట్టుకొన్న టొమాటో ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
టొమాటోలు మగ్గిన తరువాత అందులో ఉప్పు, కారం, వేయాలి. కొద్దిగా వేగాక పచ్చి బఠానీలు వేసి రెండు నిమిషాలు వేగాక ఒక కప్పు నీళ్ళు
పోసి ఉడికించాలి.
కూర దగ్గరగా అయ్యాక ఎండు కొబ్బరి తురుము, ధనియాల పొడి,కొత్తిమీర వేసి దించేయాలి.
అంతే రుచికరమైన పచ్చి బఠాణీల కూర రెఢీ.
ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది చపాతీ, పూరి లోకి కూడా చాలా బాగుంటుంది.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: మటన్ బిర్యానీ / mutton biryani
Post a Comment
If you have any doubts, Please let me know.