గోధుమ పిండి తో స్నాక్స్

హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు గోధుమ పిండి తో స్నాక్స్ తయారు చేసే పద్ధతి చూద్దాం.

wheat flour snacks


కావలసిన పదార్థాలు:-

గోధుమ పిండి
ఉప్పు రుచికి సరిపడా
కరివేపాకు
పుదీనా
నూనె
వాము
నీళ్ళు

తయారు చేసే విధానం:-

  • ఒక గిన్నలోకి గోధుమ పిండి ఒక కప్పు తీసుకొని అందులో సగం చెంచా వాము,సగం చెంచా కారం, ఉప్పు, కరివేపాకు, పుదీనా సన్నగా తరిగి వేసుకోవాలి.
  • ఇప్పుడు అందులో ఒక స్పూన్ నూనె వేసి బాగా కలిపి అందులో తగినంత నీళ్ళు పోసి పిండి గట్టిగా ముద్ద చేసుకోవాలి.
  • ఆ పిండి ముద్ద ను చపాతీ లాగా చేసుకొని మనకు కావలసిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో వేసి ఫ్రై చేసుకోవాలి.
  • అంతే రుచికరమైన క్రీస్పి స్నాక్స్ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️