హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం.
నల్ల వంకాయలు
నూనె
జీలకర్ర
కరివేపాకు
ఉల్లిపాయ ముక్కలు
అల్లం వెల్లుల్లి పేస్ట్
పసుపు చిటికెడు
కారం తగినంత
ఉప్పు రుచికి సరిపడా
కొత్తిమీర
పల్లీలు
నువ్వులు
చింత పండు కొద్దిగా
ఎండు కొబ్బరి పొడి
ధనియాల పొడి
గరం మసాలా
తయారు చేసే విధానం:-
- స్టౌ వెలిగించి పాన్ లో పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి వేసి వేరు వేరు గా ఫ్రై చేసుకోవాలి.
- చింత పండు నాన బెట్టాలి.
- ఇప్పుడు చింత పండు, పల్లీలు, నువ్వులు, ఎండుకొబ్బరి, కారం, ఉప్పు, పసుపు తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- వంకాయలను నాలుగు ముక్కలూ విడిపోకుండా కట్ చేసి అందులో తయారు చేసి పెట్టుకొన్న పేస్ట్ కుర్చీ పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసి అందులో వంకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- వంకాయలు మగ్గిన తర్వాత అందులో మిగిలిన పేస్ట్ వేసి బాగా కలపాలి.
- ఫ్రై అయిన తర్వాత అందులో తగినన్ని నీళ్ళు పోసి నూనె పైకి తేలే వరకు చిన్న మంట మీద ఉడికించాలి.
- చివరగా కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి దించేయాలి.
- అంతే నోరూరించే గుత్తి వంకాయ కూర రెడీ.
Also read: దహి (పెరుగు) చికెన్ ఫ్రై
Post a Comment
If you have any doubts, Please let me know.