హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు:-
ఎగ్స్
నూనె
జీలకర్ర
పచ్చి మిర్చి
క్యారట్ ముక్కలు
బీన్స్ ముక్కలు
పసుపు
కొత్తిమీర
అల్లం వెల్లుల్లి పేస్ట్
ధనియాల పొడి
గరం మసాలా
ఉప్పు తగినంత
కారం తగినంత
టొమాటో సాస్
చిల్లీ సాస్
ఉడికించిన అన్నం
తయారు చేయు విధానం:-
- ముందుగా స్టౌ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర,పచ్చి మిర్చి ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు అందులో క్యారట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి.
- ఫ్రై అయిన తర్వాత అందులో ఎగ్స్ కొట్టి వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు తగినంత ఉప్పు,కారం వేసుకోవాలి.
- ఒక నిమిషం తరువాత అందులో ఉడికించిన అన్నం వేసి బాగా కలపాలి.
- అన్నం మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత అందులో టొమాటో సాస్, చిల్లీ సాస్ వేసి కలపాలి.
- ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి దించేయాలి.
- (పచ్చి మిర్చి, కారం, చిల్లి సాస్, వేస్తున్నాం కాబట్టి చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. లేకపోతే ఘాటు ఎక్కువ అవుతుంది.
- అంతే రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: గుత్తి వంకాయ కూర (వంకాయ మసాల కూర)
Post a Comment
If you have any doubts, Please let me know.