హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
ఈరోజు ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బొబ్బర్లతో చాట్ చెయ్యటం ఎలా చూద్దాం. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కూడ హెల్ప్ చేస్తుంది. ఉదయం పూట అల్పాహారం లా తీసుకోవచ్చు. మీరు డైటింగ్ చేస్తున్నాను ఐతే నైట్ డిన్నర్ లో కూడా దీన్ని తీసుకోవచ్చు.. దీనితో పాటుగా కీర దోసకాయ ముక్కలు, క్యారట్ ముక్కలు తీసుకుంటే మి డిన్నర్ పూర్తి అవుతుంది. ఇది లైట్ పుడ్ ఇంకా ప్రోటీన్ రిచ్ డైయట్.... తప్పకుండా మీ కోసం ట్రై చెయ్యండి..
• బొబ్బర్ల ఫ్రై/ చాట్ చేయడానికి ముందుగా బొబ్బర్లని వేడి నీళ్ళలో నాలుగు గంటల పాటు నానపెట్టాలి.
వేడి నీళ్ళలో ఎందుకు నానపెట్టాలి అంటే తొందరగా నానుతాయి. ( కుక్కర్ లో 4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి)
చల్లటి నీటిలో నానపెట్టితే ఎక్కువ సమయం పడుతుంది నానడానికి. ( కుక్కర్ లో 6 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి)
• ముందు రోజు రాత్రి నానపెడితే( కుక్కర్ లో 4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి) తొందరగా ఉడుకుతాయి.
ఉడికించేటప్పుడు బొబ్బర్లలో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి
కావలసిన పదార్థాలు:-
ఉడికించిన బొబ్బర్లు
నూనె ఒక టేబుల్ స్పూన్
కొద్దిగా జీలకర్ర
కొద్దిగా ఆవాలు
ఒక ఉల్లిపాయ (ముక్కలు చేసి పెట్టుకోవాలి)
ఒక టొమాటో
కొద్దిగా పసుపు
ఒక పచ్చి మిర్చి ( చిన్న ముక్కలు)
కరేపాకు ఒక రెమ్మ
కొద్దిగా కొత్తిమీర
ధనియాల పొడి
అల్లం వెల్లుల్లి పేస్ట్ ( మీకు నచ్చితే వేసుకోండి)
ఉప్పు రుచికి తగినంత
తయారీ విధానం:-
కడాయి లో నూనె పోసి కాగాక జీలకర్ర , ఆవాలు, పచ్చి మిర్చి, కరెపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలిపి ఉడికించిన బొబ్బర్లు వేసి బాగా కలపాలి.
ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత తగినంత ఉప్పు, కొద్దిగా దనియల పోడి వేడి బాగా కలిపి ఫ్రై చేయాలి.
చివరగా కొత్తిమీర వేసి దించేయాలి అంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ప్రోటీన్ నిండిన బొబ్బర్లు వేపుడు రెడీ...
తప్పకుండా ట్రై చెయ్యండి.
Please support me 🙏🙏
Thank you 😊 everyone
Also read: వంకాయ కరేపకు పొడి కూర
Post a Comment
If you have any doubts, Please let me know.