హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
రొటీన్ గా మనం అన్ని రకాల వెరైటి వంటలు చేసుకుంటాము. కాని ఈరోజు మనం బ్యూటీ టిప్స్ నేర్చుకుందాం... ఎక్కువగా మన ఇంట్లో ఉండే వాటితో మన అందాన్ని కాపాడుకోవచ్చు. కొంచెం టైమ్ తీసుకొని మన అందాన్ని మనం కాపాడుకోవచ్చు..... తప్పకుండా ప్రయత్నించండి....
బ్యూటీ టిప్స్...
కళ్ళకింద నల్లటి వలయాలుపోగొట్టుకోవడానికి చిట్కాలు:-
- నిమ్మరసం, టమాటరసం బాగా కలిపి నల్లని వలయాలపై రాయాలి.
- బంగాళా దుంప రసాన్ని కంటి కింద రాసి పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.
- బంగాళాదుంపను తురిమి చిన్న వస్త్రంలో మూట కట్టి కంటిపై పదిహేను నిమిషాల దాకా ఉంచాలి.
- కీరదోస ముక్కల్ని కోసి ఫ్రిజ్ లో ఉంచాలి. చల్లగా అయ్యాక కళ్లపై పెట్టుకోవాలి.
- ఆరెంజ్ జ్యూస్ , గ్లిసెరిన్ సమంగా తీసుకొని, మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
జిడ్డు చర్మం తగ్గాలంటే..
- తేనె, చక్కెరలను సమానంగా తీసుకుని, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మృదువుగా మర్ధన చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీళ్లతో కడుక్కోవాలి.
- మూడు చెంచాల సెనగపిండిలో ఒక చెంచా
- నిమ్మరసం, సరిపడినంత పెరుగు వేసుకుని పూతలా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జిడ్డు సమస్య తగ్గుతుంది.
ఇంట్లో పెరుగు కూడా మీ సౌందర్యాన్ని పెంచుతుంది
- ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకునే పెరుగు, మజ్జిగలో ఎన్నో రకాల పోషక విలువలు బాగున్నాయి. అవి ఆరోగ్యంతోపాటు అందాన్ని కూడా ఇస్తాయి.
- అందుకనే పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఓ 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతం అవుతాయి.
- తలస్నానం చేసేందుకు ఓ గంట ముందుగా తలకు పెరుగును బాగా పట్టించి తలస్నానం చేసినట్లయితే.. మళ్లీ విడిగా కండీషనర్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.
- అలాగే పెరుగులో తేనెను కలిపి పూసినా చక్కని కండీషనర్లా ఉపయోగపడుతుంది.
- పెరుగులో శనగపిండిని కలిపి,నలుగుపిండిలా శరీరానికి పట్టిస్తే.. చర్మం, ముఖం మీదనున్న
- మృతకణాలు తొలగిపోతాయి.
- ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి, శరీరమంతటా అప్లై చేస్తే అది క్లెన్సింగ్ ఏజెంటులా పనిచేస్తుంది.
- పెరుగులో కాస్తంత చక్కెరగానీ లేదా ఉప్మా రవ్వగానీ వేసి బాగా కలిపి.. ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే డెడ్ స్కిన్తొలగిపోతుంది.
- పెరుగులో కాస్త పచ్చి పసుపును వేసి కళ్లచుట్టూ ఉండే నల్లటి వలయాలపై రాస్తే నలుపుదనం తగ్గుతుంది. ఎండలోంచి నీడలోకి వెళ్లగానే పెరుగులో ఐస్ క్యూబ్ వేసి ఆ మిశ్రమంతో ముఖానికి మసాజ్ చేస్తే ఎండకు కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది.
Also read: పాలక్ పరోటా / palak paratha
Post a Comment
If you have any doubts, Please let me know.