హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
మనం రకరకాలుగా వంకాయ కర్రీలు చేసుకుంటుంటాం. వంకాయ కర్రీ, వంకాయ ఫ్రై, వంకాయ మసాలా, వంకాయ పూర్ణం, నూనె వంకాయ ఇలా చాలా రకాలు. వంకాయ అంటే ఇష్టం ఉండని వాళ్లు ఉండరు. ఇప్పుడు నేను మీకు షేర్ చేసే వంకాయ కర్రీ కరివేపాకు పొడి తో తయారు చేస్తాం. ఇది పాత కాలం వంట ఆరోగ్యానికి చాలా మంచిది... ఐతే వెరైటీ రుచికరమైన వంకాయ కరేపాకు పొడి కూర తయారు చేసే పద్దతి నేర్చుకుందాం....
కావలసిన పదార్థాలు :
నూనె
పోపు దినుసులు
పచ్చిమిర్చి
ఇంగువ
వంకాయలు
పసుపు
ఉప్పు
కారం
కొత్తిమీర
కరేపాకు
ధనియాలు
వెల్లుల్లి
నువ్వులు
జీలకర్ర
తయారు చేసే విధానం :-
- వంకాయ కర్రీ చేసుకోవడానికి ముందుగా వంకాయలను కట్ చేసి ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో కొద్దిగా ఉప్పు వేసి అందులో వంకాయ ముక్కలు వేసుకోవాలి.
- ఇలా ఉప్పు నీళ్లలో వేయడం వల్ల వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. అలాగే ఇప్పుడు కరేపకు పొడి కూడా చేసి పెట్టుకోవాలి.
- కరేపాకు పొడి కోసం కరేపాకు, ధనియాలు, వెల్లుల్లి, నువ్వులు, జీలకర్ర అన్ని నూనె లేకుండా వేయించి చల్లార్చి పొడి చేసుకోవాలి.
- ఇప్పుడు కూర చేసుకోవడానికి స్టౌ వెలిగించి స్టౌ మీద కడాయి పెట్టి నూనె పోసి పోపు దినుసులు,ఇంగువ, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసాక పసుపు వేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి.
- ఈ వంకాయ పోడి కూర కాబట్టి ఉల్లిపాయలు వేయడం లేదు. కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు.
- కాసేపు మగ్గిన తర్వాత తయారు చేసుకున్న కరేపాకు పొడి ,తగినంత కారం,ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి.చివరగా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి.
- ఫ్రై లు ఎక్కువగా నచ్చని వారు ఇందులో కొంచెం నీళ్లు పోసుకుంటే గ్రేవీ తయారవుతుంది.
- అంతే రుచికరమైన వంకాయ కరేపాకు పొడి కూర రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి.మీకు నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: బూంది కర్రీ / Boondhi Curry
Post a Comment
If you have any doubts, Please let me know.