హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం టొమాటో సోయా కర్రీ తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.
కావలసిన పదార్థాలు:-
నానబెట్టిన సోయా(మిల్మేకర్ ) - కప్పు
టొమాటో తరుగు - కప్పు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు
ఉల్లిపాయ ముక్కలు అర కప్పు,
పుదీనా ఆకులు
వెల్లుల్లి రేకలు 3
పచ్చిమిర్చి
జీడిపప్పు పలుకులు - 10
బాదంపప్పులు - 6
పసుపు
కారం
గరంమసాలా
కొత్తిమీర - కొద్దిగా
తయారు చేసే విధానం:-
- ఒక పెద్ద పాత్రలో మిల్మేకర్ వేసి నీళ్ళు పోసి నానపెట్టుకోవలి.
- బాణలిలో టేబుల్ స్పూను నూనె కాగాక, వెల్లుల్లి రేకలు వేసి వేయించాలి.
- పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పు, బాదంపప్పు,వేసి రంగు మారే వరకు వేయించాలి.
- వేయించిన అన్ని చల్లార్చి మిక్సి లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- ఇప్పుడు అదే కడాయిలో నూనె పోసి కాగిన తరువాత ఉల్లితరుగు వేసి వేయించాక,టొమాటో తరుగు వేసి బాగా కలపాలి.
- బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగించాలి.
- తర్వాత మీల్ మేకర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- దానికి సరిపడా కారం, ఉప్పు, ధనియాలపొడి, గరంమసాలా వేసి బాగా కలపాలి.
- ముందుగా చేసి ఉంచు కున్న పేస్ట్ వేసి రెండు నిముషాలు ఉడికించాలి.
- కొద్దిగా నీరు జతచేసి ఐదు నాలుగైదు నిముషాలు
- ఉడికించి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
- అంతే రుచికరమైన సోయా టొమాటో కర్రీ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: రొయ్యల వేపుడు / prawns fry
Post a Comment
If you have any doubts, Please let me know.