హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
పకోడీలు:-
పకోడీ అంటే ఎప్పుడు మనం ఉల్లిపాయతో కరకరలాడే పకోడీలు చేస్తూ ఉంటాం.ఈరోజు మనం ఉల్లిపాయలతో బజ్జీ తయారు చేసే విధానం నేర్చుకుందాం. ఇది కొంచెం స్మూత్ గా ఉంటాయి. కరకరలాడే లా ఉండవు. చాలా రుచిగా ఉంటాయి.
కావలసిన పదార్థాలు:-
ఉల్లిపాయలు
నూనె
ఉప్పు తగినంత
కారం
పసుపు
జీలకర్ర కొద్దిగా
వాము
సెనగపిండి
నీళ్ళు
అల్లం వెల్లుల్లి పేస్ట్
కొత్తిమీర
చిటికెడు వంటసోడా
తయారు చేసే విధానం:-
- ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొడవుగా అవసరం లేదు
- ఉల్లిపాయలు ఒక గిన్నలోకి తీసుకుని అందులో తగినంత కారం,ఉప్పు, పసుపు, వాము, జీలకర్ర, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక సారి కలపాలి.
- ఇప్పుడు అందులో శెనగపిండి దానికి తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి.
- పిండి మరీ పల్చగా చేయకూడదు.చివరగా వంట సోడా వేసుకోవాలి.
- స్టౌ వెలిగించి పాన్ లో నూనె పోసి బాగా కాగాక అందులో పిండి తో చిన్న చిన్న ఉండలుగా బజ్జీలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి.
- అంతే రుచికరమైన ఉల్లిపాయ బజ్జీ రెడీ.
- తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి.నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: వెజిటబుల్ కిచిడి (Vegetable Khichidi)
Post a Comment
If you have any doubts, Please let me know.