చింతకాయ రైస్ / chinthakaya rice

 హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.

రొటీన్ గా మనం రైస్ వెరైటీస్ చేసుకుంటాము. కాని ఈరోజు మనం చింతకాయల తో వెరైటీగా టామరిండ్ రైస్ తయారు చేసుకుందాం.చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి....

Chinthakaya rice

కావాల్సిన పదార్థాలు:-

చింతకాయలు లేతవి ఒక పది కాయలు

అన్నం - రెండు కప్పులు

శనగపప్పు

మినప్పప్పు

ఆవాలు చెంచా

పల్లీలు

ఎండుమిర్చి నాలుగు

పచ్చిమిర్చి - ఆరు

కరివేపాకు - రెండు రెమ్మలు

ఇంగువ - పావుచెంచా

పసుపు -అరచెంచా

ఉప్పు తగినంత

తెల్లనువ్వుల పొడి టేబుల్ స్పూన్

నూనె పోపు కోసం

తయారు చేసే విధానం:-

  • ముందుగా బియ్యాన్ని ఆరగంట సేపు నానబెట్టుకొని, పొడిగా ఉండేటట్లు అన్నం వండుకోవాలి.
  • చింతకాయల్ని తొక్కు తీసేసి అందులో రెండు పచ్చిమిర్చీ, కొద్దిగా ఉప్పు, సగం చెంచా పసుపు వేసిముద్దలా చేసుకుని పెట్టుకోవాలి.
  • ఇప్పుడు పాన్లో నూనె వేడి చేసి పల్లీలు వేసి వేయించాలి.
  • అందులోనే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చీ వేయాలి.
  • కొంచెం వేగాక, మిగిలిన పచ్చిమిర్చి, కరివేపాకు,
  • ఇంగువ, మిగిలిన పసుపు వేసుకోవాలి.
  • అన్నీ వేగాక కొద్దిగా ఉప్పు, ముందుగా తయారు చేసుకున్న చింతకాయ ముద్ద కూడా వేయాలి.
  • అది కొద్దిగా వేగాక అందులో అన్నం వేసి బాగా కలపాలి.
  • చివరిగా తెల్లనువ్వుల పొడి వేసి కలిపి ఓ గిన్నెలోకి
  • తీసుకుంటే చాలు.
  • నువ్వుల వాసన ఇష్టం లేనివారు వేయించిన వేరు శెనగపప్పును వేసుకోవచ్చు.
  • అంతే రుచికరమైన వంటకం చింతకాయల రైస్ రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.

Also read: హెల్త్ టిప్స్ / health tips

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️