హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
మనం చాలా రకాల పాప్ కార్న్ లు రెడీ చేసుకుంటూ ఉంటాం . కాలిఫ్లవర్ ,పనీర్ పాప్ కార్న్ లు చేసుకుంటాము. కాని ఈరోజు చికెన్ తో వెరైటీగా పాప్ కార్న్ తయారు చేసుకుందాం.చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తినని పిల్లలకు పాప్ కార్న్ లా ఇస్తే చాలా ఇష్టపడతారు ..తప్పకుండా ప్రయత్నించండి....
కావలసిన పదార్థాలు:-
చికెన్ అర కిలో (బోన్ లెస్)
మొక్కజొన్న పిండి - ఒకటిన్నర కప్పు
బ్రెడ్ పౌడర్ - అర కప్పు
కారం - 1 టేబుల్ స్పూన్
నీళ్లు - కొద్దిగా,
ఉప్పు - తగినంత
సోయాసాస్
మిరియాల పొడి,
మైదా పిండి టేబుల్ స్పూన్ చొప్పున
గుడ్డు - ఒకటి
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారు చేసే విధానం:-
- ముందుగా చికెన్ తీసుకోని శుభ్రంగా కడిగి పలుచగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్ లో తీసుకోని అందులో అరకప్పు మొక్కజొన్న పిండి వేసుకుని.. కొద్దిగా నీళ్లు పోసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అందులో చికెన్ ముక్కలు వేసుకుని ఇదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక పెద్ద బౌల్ లోకి చికెన్ ముక్కలు మాత్రమే తీసుకుని అందులో సోయాసాస్, మిరియాల పొడి, మైదా పిండి, గుడ్డు, కొద్దిగా ఉప్పు వేసుకుని అంతా కలిసేలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక కప్పు మొక్కజొన్న పిండి, కారం, కొద్దిగా ఉప్పు ,కొద్దిగా నీళ్ళు వేసుకుని బాగా కలిపి చికెన్ ముక్కలను అందులో వేసి పెట్టుకోవాలి.
- స్టవ్ వెలిగించి కడాయిలో నునే పోసి కాగనివ్వాలి.కాగుతున్న నూనెలో వేసుకుని దోరగా వేయించుకోవాలి.
- వీటిని సాస్ తో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.తప్పకుండ ట్రై చేయండి.
తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.
Also read: యాపిల్ మిల్క్ షేక్ / Apple Milk Shake
Post a Comment
If you have any doubts, Please let me know.