హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
మనం రకరకాలుగా వంకాయ కర్రీ లు చేసుకుంటుంటాం.వంకాయ బోటి కూర,వంకాయ ఆలుగడ్డ కూర, వంకాయ వేపుడు,గుత్తి వంకాయ కూర ఇలా చాలా ఐతే ఈరోజు నోరూరించే వంకాయ ఖీమా తయారు చేసే పద్దతి నేర్చుకుందాం...
కావలసిన పదార్థాలు :
వంకాయలు
మటన్ ఖీమా
నూనె
జిలకర
లవంగాలు
దాల్చిన చెక్క
మిరియాలు
ధనియాలు
ఉల్లిపాయలు
కొత్తిమీర
ఉప్పు
పసుపు
తగినన్ని నీళ్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్
కారం
టొమోటో
పుదీనా
గరం మసాలా
తయారు చేసే విధానం :-
ముందుగా మసాలా దినుసులని వేయించి పొడి చేసుకోవాలి.తర్వాత ఖీమా ని ఉడికించుకోవాలి.
వంకాయలను ముక్కలు చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు కడాయి పెట్టి నూనె పోసి జిలకర,ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించుకోవాలి.ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్,పసుపు,కొద్దిగా ఉప్పు వేసుకోవాలి.
ఇప్పుడు వంకాయముక్కలు వేసి వేయించుకోవాలి.ఇప్పుడు మటన్ ఖీమా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు టొమోటో ముక్కలు వేసుకోవాలి.తర్వాత తగినంత ఉప్పు ,కారం ,వేయించుకున్న మసాలా పొడి ,తగినన్ని నీళ్లు పోసి పది నిముషాలు ఉడికించుకోవాలి.
తర్వాత కొత్తిమీర,పుదీనా వేసుకొని దించుకోవాలి.
అంతే రుచికరమైన వంకాయ ఖీమా రెడి.
Post a Comment
If you have any doubts, Please let me know.