హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
రొటీన్ గా మనం అన్ని రకాల వడ లు చేసుకుంటాము. కాని ఈరోజు వెజిటబుల్ తో వెరైటీగా మిక్స్డ్ వెజిటబుల్ వడలు తయారు చేసుకుందాం.చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి....
కావలసిన పదార్థాలు:-
క్యారట్
క్యాబేజి
ఆలుగడ్డ
ఉల్లిపాయలు
పచ్చిమిర్చి
కొత్తిమీర
కరెపాకు
జీలకర్ర
బీన్స్
కారం
ఉప్పు
టమాటాలు
ధనియాలపొడి
జీలకర్రపొడి
బియ్యంపిండి
నూనె
తయారు చేసే విధానం:-
- ముందుగా వేజిటబుల్స్( క్యారట్, క్యాబేజి,ఆలుగడ్డ,బీన్స్ ) అన్నింటిని కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి.
- ఆ తర్వాత ఒక గిన్నె తీసుకోని దానిలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు, కరేపాకు, జిలకర, ఉప్పు తగినంత, కారం, టమాటా ముక్కలు, ధనియాలపొడి కొద్దిగా, జీలకర్రపొడి కొద్దిగా వేయాలి. ఇప్పుడు ఉడికించిన కూరగాయలు వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని గారెల్లా వేసుకోవడానికి దానిలో తగినంత బియ్యంపిండి వేసి చక్కగా ముద్దలా కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి గారెలు వేయించడానికి సరిపడా నూనె పోసి వేడిచేసుకోవాలి.
- నూనె వేడయ్యాక మనం తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న గారెల్లా చేసుకొని నూనె లో వేసుకొని స్టవ్ మంట మద్యస్థంగా పెట్టుకొని ఎర్రగా కాల్చుకోవాలి.
- అంతే వేడి వేడి వెజిటబుల్ గారెలు రెడి .వీటిని ఇలాగే తినొచ్చు లేదా సాస్ తో తింటే ఇంకా రుచిగా ఉంటాయి.
తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి.మీకు నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.