బెండకాయ మసాలా కర్రీ

హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు వెరైటీగా బెండకాయ మసాలా కర్రీ  తయారు చేసుకుందాం.


కావలసిన పదార్థాలు:-

 బెండకాయ 
నూనె 
జీలకర్ర 
పెరుగు 
ఉప్పు 
కారం 
ధనియాలపొడి 
కొత్తిమీర 
ఎండుమిర్చి 
కరివేపాకు 
నీళ్లు
టమాటా ముక్కలు
ఉల్లిపాయ ముక్కలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ 
పసుపు

తయారు చేసే విధానం:-

  • బెండకాయలు ,ఉల్లిపాయలు, టమాటాలు అన్ని కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడి అయిన తర్వాత అందులో జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ,కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలి.
  • ఇప్పుడు అందులో టమాటా ముక్కలు వేసి మగ్గించాలి 
  • టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో బెండకాయ ముక్కలు వేసి పది నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
  • తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలపాలి
  • ఇప్పుడు తగినంత కారం, ఉప్పు,ధనియాల పొడి వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
  •  ఫ్రై అయిన తర్వాత అందులో ఒక కప్పు పెరుగు వేసి కలపాలి బాగా కలిపిన తరువాత కావలసిన అన్ని నీళ్ళు పోసుకోవాలి .
  • నూనె పైకి తేలే వరకు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️