హాయ్ ప్రెండ్స్,
ఈరోజు బియ్యం పిండి తో అట్లు ఎలా చేయాలో చూడండి.
కావలసిన పదార్థాలు:-
బియ్యం పిండి ఒక కప్పు
ఉప్మా రవ్వ మూడు స్పూన్లు
కొత్తిమీర
పచ్చి మిర్చి ముక్కలు
ఉల్లిపాయ ముక్కలు
ఉప్పు తగినంత
అల్లం ముక్కలు
కరవేపాకు
నూనె
రెండు స్పూన్లు పెరుగు
తయారు చేసే విధానం:-
- ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకొని అందులో ఉప్మా రవ్వ,అల్లం,పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు,ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్ళు పోసి దొసల పిండి కన్న కొంచెం పలుచగా కలుపుకోవాలి.
- పిండిని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి.
- రవ్వ సాప్ట్ గా అవ్వడానికి టైం తీసుకుంటుంది.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పెనం పెట్టీ వేడి చేసి ఒక గ్లాస్ తో కానీ, గరిటతో కానీ పిండిని పెనంపై అట్టు లా వేసుకొని పై నుండి నూనె వేసి రెండు వైపుల ఎర్రగా కాల్చుకోవాలి.
- అంతే క్రిస్పి బియ్యం పిండి అట్లు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి
Post a Comment
If you have any doubts, Please let me know.