చిన్నపిల్లల ఆహారం(ముద్దపప్పు)

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం చిన్న పిల్లలకు నెయ్యి ముద్దపప్పు తయారు చేసుకుందాం.


కావలసిన పదార్థాలు:-

నెయ్యి

జీలకర్ర

పచ్చిమిర్చి

ఉప్పు

పెసర పప్పు

బియ్యం

ఇంగువ చిటికెడు

పసుపు

కొత్తిమీర

తయారు చేసే విధానం:-

  • ముందుగా బియ్యం కడిగి మెత్తగా ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు పెసరపప్పును ఉడికించి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, పచ్చి మిర్చి ముక్కలు, కొత్తిమీర, పసుపు,చిటికెడు ఇంగువ వేసి ఫ్రై చేసి పప్పులో కలపాలి.
  • ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసి కలపాలి.
  • పప్పు లో నీళ్ళు ఎక్కువగా వేయకూడదు.
  • ఇప్పుడు ఈ పప్పు మనం మెత్తగా వండుకున్న అన్నంలో వేసి బాగా కలిపి తినిపించాలి.
  • అంతే చాలా రుచిగా ఉంటుంది.
  • తప్పకుండా పిల్లలకు తినిపించే ప్రతి ఆహారం మనం రుచి చూడాలి ఎలా ఉందో తెలుసుకోవాలి.
తప్పకుండా ప్రయత్నించండి లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
  

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️