హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు టొమాటో ములక్కాడ కూర రెడీ చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
ఉల్లిపాయ ముక్కలు
టమాటాలు నాలుగు
ములక్కాడ ముక్కలు
నూనె
జీలకర్ర
ఆవాలు
కరివేపాకు
ఉప్పు తగినంత
కారం తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్
ఎండు మిరపకాయలు
పసుపు
కొత్తిమీర
ధనియాల పొడి
తయారు చేసే విధానం:-
- ములక్కాయలు, టొమాటోలు, ఉల్లిపాయలు అన్ని కట్ చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె వేసి కాగాక అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండు మిరపకాయలు, వేసి ఫ్రై చేసుకోవాలి.
- తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు అందులో టొమాటో ముక్కలు వేసి బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకొన్న ములక్కాడ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టీ పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
- పది నిమిషాల తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి.
- ఇప్పుడు తగినంత కారం, ఉప్పు, ధనియాలపొడి గరంమసాలా ఒక గ్లాసు నీళ్ళు పోసి బాగా ఉడికించుకోవాలి.
- చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.
- అంతే రుచికరమైన ములక్కాడ టొమాటో కూర రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.