హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా హోటల్ స్టైల్ సమోసా ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు:-
మైదా పిండి
బట్టర్
నూనె
వాము
ఉడికించిన ఆలూ
ఉడికించిన బఠాణీ
కారం
ఉప్పు
పచ్చిమిర్చి
అల్లం తరుగు
మిరియాల పొడి
ఉల్లిపాయ ముక్కలు
సోంపు
జీలకర్ర
ధనియాలు
పసుపు
కొత్తిమీర
తయారు చేసే విధానం:-
- ఒక గిన్నె తీసుకొని అందులో మైదా పిండి, వాము,కొద్దిగా వెన్న లేదా నూనె వేసి కలిపి తర్వాత నీళ్లు వేసుకొని గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోవాలి.
- కలిపిన పిండి మీద ఒక గుడ్డ కప్పి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి పెట్టీ అందులో జీలకర్ర, సోంపు, ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి.
- చిన్న రోటిలో కని మిక్సి లో కాని వేసి పలుకులు గా చేసుకోవాలి. మెత్తగా చేయకూడదు. బరకగా చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో అల్లం తరుగు,ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉడికించిన ఆలూ, ఉడికించిన బఠాణీ, మిరియాల పొడి, పొడి చేసుకున్న సోంపు, జీలకర్ర, ధనియాల మిశ్రమం, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
- రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి దించేయాలి.
- ఇప్పుడు కలుపుకున్న పిండి కొద్దిగా తీసుకొని చపాతీలా వత్తుకోవాలి.
- చపాతీ నీ సగం చేసుకొని అందులో కర్రీ పెట్టుకొని సమోసా చుట్టుకోవాలి.
- అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడి చేసుకోవాలి.
- ఇప్పుడు మంట తక్కువ పెట్టుకొని సమోసాలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- అంతే రుచికరమైన క్రీస్పీ సమోసా రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: బియ్యం పిండి తో చేకొడిలు
Post a Comment
If you have any doubts, Please let me know.