బియ్యం పిండి తో చేకొడిలు

హాయ్ ఫ్రెండ్స్ ,

ఈరోజు మనం టేస్టీ గా దాబా స్టైల్ లో బియ్యం పిండి తో చెకొడిలు ఎలా చేయాలో చూద్దాం.

rice flour rings

కావలసిన పదార్ధాలు:-

బియ్యం పిండి
నూనె
కారం
ఉప్పు
నువ్వులు
వాము
నీళ్లు
పసుపు

తయారు చేసే విధానం:-

  • స్టౌ వెలిగించి గిన్నె లో నీళ్ళు పోసి అందులో వాము, ఉప్పు రుచికి సరిపడా, కారం తగినంత,పసుపు,నువ్వులు వేసి బాగా మరిగించాలి.
  • నీళ్ళు మరిగిన తర్వాత బియ్యం పిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించాలి.
  • తర్వాత స్టౌ ఆఫ్ చేసి పిండిని చల్లార్చుకోవాలి.
  • చల్లారిన తరువాత అందులో ఒక స్పూన్ నూనె వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  • తర్వాత చిన్న చిన్న ఉండలుగా పిండి తీసుకొని చపాతీ పీట మీద చేతితో సన్నగా రోల్ చేసి గుండ్రని రింగ్స్ లా చేసుకొని చేకోడిలు పక్కన పెట్టుకోవాలి.
  • అన్ని చేసుకున్నాక కాల్చుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో మనం చేసుకున్న చేకొడిలు వేసి ఎర్రగా కాల్చుకోవాలి.
  • అంతే రుచికరమైన చేకొడిలూ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️