హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా దాబా స్టైల్ లో చెకెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు:-
చికెన్
నిమ్మ రసం
కారం తగినంత
ఉప్పు తగినంత
మైదా ఒక స్పూన్
కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్
ఉడికించిన అన్నం
నూనె
ఒక ఎగ్
క్యారట్ ముక్కలు
క్యాబేజ్ తరుగు
క్యాప్సికమ్ ముక్కలు
ధనియాల పొడి
గరం మసాల
కొత్తిమీర
అల్లం వెల్లుల్లి పేస్ట్
ఫుడ్ కలర్
వెల్లుల్లి తరుగు
చిల్లీ సాస్
టొమాటో సాస్
తయారు చేసే విధానం:-
- ముందుగా ఒక గిన్నెలో చికెన్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కారం, ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, కార్న్ ఫ్లోర్, కొద్దిగా నీళ్లు పోసి ముక్కలకు పట్టించి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు చికెన్ నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో ఎగ్ కొట్టి పోసి పొడిగా ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు అందులో క్యారట్ ముక్కలు, క్యాబేజ్, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఫ్రై అయిన తర్వాత అందులో ఫ్రై చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలు వేసి వేయించాలి.
- ఇప్పుడు ఉడికించిన అన్నం, ఉప్పు, కారం తగినంత, ధనియాల పొడి, గరం మసాలా, చిల్లీ సాస్, టొమాటో సాస్, కొత్తిమీర అన్ని వేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
- అంతే రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ.
Post a Comment
If you have any doubts, Please let me know.