టొమాటో నువ్వుల పచ్చడి

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం టేస్టీ గా టొమాటో నువ్వుల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం.

tomato sesame chutney

కావలసిన పదార్ధాలు:-

టొమాటో ముక్కలు
పసుపు
ఉప్పు తగినంత
నూనె సరిపడా
కొత్తిమీర
నువ్వులు
పల్లీలు
పచ్చిమిర్చి
వెల్లుల్లి
జీలకర్ర
ఆవాలు
ఎండుమిర్చి
చింత పండు
మినపప్పు సగం చెంచా
సెనగపప్పు సగం చెంచా

తయారు చేసే విధానం:-

  • స్టౌ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
  • అదే నూనెలో టొమాటో ముక్కలు, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసి చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ మీద కడాయి పెట్టుకుని అందులో నువ్వులు, పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • చింత పండు నానపెట్టి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సి జార్ లో పల్లీలు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి, చింత పండు ఒకదాని తరువాత మరొకటి వేసి మిక్సి పట్టాలి.
  • మిక్సి పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సి లో పచ్చి మిర్చి, ఉడికించిన టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  • ఇప్పుడు అన్ని ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ మీద కడాయి పెట్టుకుని అందులో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర,ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు,సెనగపప్పు,పసుపు వేసి ఫ్రై చేసి పచ్చడిలో కలపాలి.
  • అంతే రుచికరమైన నువ్వుల టొమాటో పచ్చడి రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read:ఆలూ టొమాటో క్యాప్సికమ్ మసాలా

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️