ఆలూ టొమాటో క్యాప్సికమ్ మసాలా

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం టేస్టీ గా హోటల్ స్టైల్ లో ఆలూ టొమాటో క్యాప్సికమ్ మసాలాలా చేయాలో చూద్దాం.

aloo tomato capsicum gravy curry

కావలసిన పదార్ధాలు:-

ఆలూ
టొమాటో
క్యాప్సికమ్
నూనె
జీలకర్ర 
ఎండుమిర్చి 
కరివేపాకు 
ఉల్లిపాయ ముక్కలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ 
పసుపు చిటికెడు 
ఉప్పు తగినంత 
కారం తగినంత 
నువ్వులు 
ఎండుకొబ్బరి 
పల్లీలు
ధనియాల పొడి
కొత్తిమీర
గరం మసాల

తయారు చేసే విధానం:-

  • ముందుగా అన్ని కూరగాయలు కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆలూ ఉడికించి పెట్టుకోవాలి.
  • స్టౌ వెలిగించి పాన్ లో నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, కారం, ఉప్పు అన్ని మిక్సి లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ మీద కడాయి పెట్టుకుని అందులో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఎండు మిర్చి ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఫ్రై అయిన తర్వాత అందులో టొమాటో ముక్కలు వేసి మెత్తగా మాగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలిపి అందులో క్యాప్సికమ్ ముక్కలు, ఆలూ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
  • ఫ్రై అయిన తర్వాత అందులో తయారు చేసి పెట్టుకొన్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టీ నూనె పైకి తేలే వరకు చిన్న మంట మీద ఉడికించాలి.
  • చివరగా కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి దించేయాలి.
  • అంతే రుచికరమైన ఆలూ టొమాటో క్యాప్సికమ్ మసాలా రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️