మటన్ డ్రై ఫ్రై

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం టేస్టీ గా మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.ఈ ఫ్రై చాలా రోజులు నిలువ ఉంటుంది.

mutton fry

కావలసిన పదార్ధాలు:-

మటన్
నూనె
జీలకర్ర
అల్లం వెల్లుల్లి పేస్ట్
పసుపు
కారం తగినంత
ఉప్పు
నీళ్ళు
ధనియాల పొడి
గరమసాలా
ఉల్లిపాయ ముక్కలు
కొత్తిమీర
పుదీనా

తయారు చేసే విధానం:-

  • ముందుగా మటన్ బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఒక గిన్నెలో మటన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టీ నీళ్లు చిక్కబడే వరకు ఉడికించి స్టౌ ఆఫ్ చేయాలి.
  • ఇప్పుడు స్టౌవ్ మీద కడాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు ఉడికించిన మటన్ వేయాలి(మొత్తం అంటే ఒకవేళ ఉడికించిన మటన్ లో నీళ్లు ఉంటే అవి కూడా వేసుకోవాలి.).
  • ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి.
  • తర్వాత అందులో తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి బాగా ఉడికేవరకు, ఒక వేళ వాటర్ ఉంటే అవి మొత్తం పోయె వరకు చిన్న మంట మీద ఉడికించాలి.
  • చివరకు కొత్తిమీర, పుదీనా వేసి కలిపి దించేయాలి.
  • ఇది ఒక నెల రోజుల పాటు నిలవ ఉంటుంది.
  • అంతే రుచికరమైన ఘుమ ఘుమ లాడే మటన్ ఫ్రై రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️