హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా హోటల్ స్టైల్ లో కొబ్బరి పల్లీల చట్నీ ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు:-
పచ్చి కొబ్బరి ముక్కలు
పల్లీలు
పచ్చి మిర్చి ముక్కలు
వెల్లుల్లి
ఉప్పు
నూనె
జీలకర్ర
ఎండుమిర్చి
కరివేపాకు
సెనగపప్పు
మినపప్పు
తయారు చేసే విధానం:-
- స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టీ వేడి అయిన తర్వాత అందులో పల్లీలు వేసి ఫ్రై చేసి వాటి పై పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సి జార్ లో పల్లీలు ఒక కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు ఒక కప్పు, పచ్చి మిర్చి పది,వెల్లుల్లి చిన్నవి పది, తగినంత ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.
- రుబ్బుకున్న చట్నీ నీ ఒక గిన్నెలో వేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా, మినపప్పు, సెనగపప్పు వేసి ఫ్రై చేసి చట్నీ లో కలుపుకోవాలి.
- అంతే హోటల్ స్టైల్ లో కొబ్బరి పల్లీల చట్నీ రెడీ.
Also read: సొరకాయ రసం(ఆనపకాయ చారు)
Post a Comment
If you have any doubts, Please let me know.