హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం బిర్యానీ గ్రేవీ తయారు చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
బిర్యానీ ఆకు
జీలకర్ర
పుదీనా
కొత్తిమీర
పల్లీలు
నువ్వులు
ఎండు కొబ్బరి
నీళ్లు
నూనె
ఉల్లిపాయలు
టొమాటోలు
పసుపు
అల్లం వెల్లుల్లి పేస్ట్
ధనియాల పొడి
గరం మసాలా
దాల్చిన చెక్క
లవంగాలు
యాలకులు
ఉప్పు
తయారు చేసే విధానం:-
- ముందుగా స్టౌ వెలిగించి పాన్ లో పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ మీద బాణలి లో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయలు,టొమాటో లు,పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కొద్దిగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- చల్లారిన తర్వాత అన్ని కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ మీద కడాయి పెట్టుకుని అందులో నూనె పోసి కాగాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు,లవంగాలు
- యాలకులు, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలపాలి.
- తర్వాత అందులో కారం,ఉప్పు, ధనియాలపొడి, గరంమసాలా వేసి కలిపి తగినన్ని నీళ్ళు పోసి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి.
- చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.
- అంతే రుచికరమైన బిర్యానీ గ్రేవీ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.