ఓట్స్ రవ్వ దోశ

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు వెరైటీగా బ్రేక్ ఫాస్ట్ ఓట్స్ రవ్వ దోశ తయారు చేసుకుందాం.

oats-ravva-dosha

కావలసిన పదార్ధాలు:-

ఓట్స్ 
రవ్వ 
రెండు స్పూన్లు మైదాపిండి 
నూనె 
ఉప్పు

తయారు చేసే విధానం:-

  • ఓట్స్ ,రవ్వ లను కడిగి ఒక గంటసేపు నానబెట్టుకోవాలి.
  • నానిన తరువాత మిక్సీలో వేసి దోసెల పిండిలాగా రుబ్బుకోవాలి.
  • పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో రెండు స్పూన్ల మైదా వేసి బాగా కలపాలి .
  • తర్వాత అందులో తగినంత ఉప్పు వేసి బాగా కలిపి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి .
  • అరగంట తర్వాత బాగా కలుపుకొని పెట్టుకొని దోశలు వేసుకోవాలి .
  • వేసుకున్న దోసెలు రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
  •  ఈ దోసెలను పల్లీ చట్నీ, టొమాటో చట్నీ వేసుకుని తింటే చాలా బావుంటుంది.
  • అంతే రుచికరమైన ఓట్స్ రవ్వ దోశ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️