హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు వెరైటీగా చింతచిగురు కోడి గుడ్డు ఫ్రై తయారు చేసుకుందాం.
కావలసిన పదార్ధాలు:-
చింత చిగురు
కోడిగుడ్లు
నూనె
జీలకర్ర
ఎండుమిర్చి
కరివేపాకు
కొత్తిమీర
ఉల్లిపాయ ముక్కలు
అల్లం వెల్లుల్లి పేస్ట్
పసుపు
ఉప్పు
కారం
ధనియాల పొడి
గరం మసాలా
తయారు చేసే విధానం:-
- ముందుగా చింతచిగురు శుభ్రం చేసుకొని దాన్ని అరచేతిలో వేసుకొని కొద్దిగా నలిపి కడిగి పక్కన పెట్టుకోవాలి.
- కొద్దిగా నూనె పోసుకొని కోడి గుడ్లు కొట్టి వేసి చిటికెడు ఉప్పు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో నూనె పోసి జీలకర్ర,ఎండుమిర్చి,కరివేపాకు,ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
- రెండు నిమిషాల తర్వాత కోడిగుడ్లు వేసి ఒక నిమిషం తరువాత చింతచిగురు వేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించాలి.
- మగ్గిన తరువాత అందులోతగినంత ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాల వేసి పది నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
- పది నిమిషాల తర్వాత బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే రుచికరమైన చింత చిగురు కోడి గుడ్డు ఫ్రై రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.