కావలసిన పదార్ధాలు:-
నూనె
చికెన్
జీలకర్ర
కరివేపాకు
అల్లం వెల్లుల్లి పేస్ట్
పసుపు
కారం
కొత్తిమీర
పెరుగు
ఉప్పు తగినంత
పచ్చిమిర్చి రెండు
ధనియాల పొడి
గరం మసాలా
ఉల్లిపాయ ముక్కలు
తయారు చేసే విధానం:-
- ముందుగా ఒక గిన్నెలో కడిగిన చికెన్ వేసి అందులో జీలకర్ర, పచ్చి మిర్చి ముక్కలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, వేయాలి.
- అర కిలో చికెన్ కి ఒక కప్పు పెరుగు వేసి బాగా కలిపి మూత పెట్టీ ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి.
- ఒక గంట తర్వాత స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో పక్కన పెట్టుకున్న చికెన్ వేసి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి.
- మంట తక్కువ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
- ఫ్రై అవ్వడానికి 30 నిమిషాలు పడుతుంది.
- ఫ్రై అయిన తర్వాత అందులో గరం మసాలా, కొత్తిమీర వేసి దించేయాలి.
- అంతే రుచికరమైన దహి చికెన్ ఫ్రై రెడీ.
Post a Comment
If you have any doubts, Please let me know.