హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం మ్యాగీ ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు:-
మ్యాగీ నూడుల్స్
ఎగ్స్
నూనె
జీలకర్ర
ఉల్లిపాయ ముక్కలు
క్యారట్
బీన్స్
టొమాటో సాస్
చిటికెడు ఉప్పు
చిటికెడు కారం
కొత్తిమీర
తయారు చేసే విధానం:-
- స్టౌ వెలిగించి గిన్నె లో నీళ్ళు పోసి మ్యాగీ వేసి, మ్యాగీ మసాలా వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- (రెగ్యులర్ గా చేసుకునే మ్యాగీ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి)
- ఇప్పుడు స్టౌవ్ మీద కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసి ఎగ్స్ కొట్టి పోసి చిటికెడు ఉప్పు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ మీద కడాయి పెట్టుకుని అందులో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యారట్ తురుము, బీన్స్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- అవి ఫ్రై అయిన తర్వాత అందులో ఎగ్ వేసుకొని చిటికెడు ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.
- తర్వాత అందులో మ్యాగీ వేసి కలిపి టొమాటో సాస్, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి.
- అంతే రుచికరమైన మ్యాగీ ఎగ్ నూడిల్స్ రెడీ.
- తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: టొమాటో
నువ్వుల పచ్చడి
Post a Comment
If you have any doubts, Please let me know.