హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం చామ గడ్డ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు:-
చామ గడ్డ
ఉల్లిపాయ ముక్కలు
పచ్చిమిర్చి
అల్లం వెల్లుల్లి పేస్ట్
పసుపు చిటికెడు
ఉప్పు తగినంత
కారం తగినంత
కొత్తిమీర
నూనె
జీలకర్ర
తయారు చేసే విధానం:-
- ముందుగా చామగడ్డ ను ఉడికించి పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె పోసుకొని చామగడ్డ లను ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ మీద కడాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలపాలి.
- అందులో తగినంత ఉప్పు, కారం వేసి ఒక నిముషం తర్వాత అందులో చామగడ్డ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
- చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.
- అంతే రుచికరమైన చామగడ్డ ఫ్రై రెడీ.
Post a Comment
If you have any doubts, Please let me know.