హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.ఈరోజు మనం మామిడికాయ పప్పు తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.
కావలసిన పదార్థాలు:-
మామిడికాయలు రెండు
కంది పప్పు ఒక కప్పు
కొత్తిమిర
నూనె
జీలకర్ర
ఎండుమిర్చి
కరివేపాకు
పసుపు
ఆవాలు
పచ్చిమిర్చి
ఉప్పు రుచికి సరిపడా
కారం
వెల్లుల్లి రెబ్బలు
తయారు చేసే విధానం:-
- కంది పప్పు కడిగి కుక్కర్లో వేసి ఉడికంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె పోసుకొని వేడి చేసి అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి,కరివేపాకు,కొత్తిమీర అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
- మామిడికాయ ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అందులో వెల్లుల్లి రెబ్బలు, మామిడి కాయ ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు అందులో ఉప్పు తగినంత, కారం తగినంత వేసుకొని ఉడికించిన పప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టీ రెండు నిమిషాలు ఉడికించాలి.
- తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి ఒక పది నిమిషాలు పిండిని మరిగించాలి.
- అంతే రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.