క్రిస్పి ఆలూ బజ్జీ

హాయ్ ఫ్రెండ్స్,

అందరికీ నమస్కారం.ఈరోజు మనం క్రిస్పి ఆలూ బజ్జీ తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

potato bajji

కావలసిన పదార్థాలు:-

ఆలూ
వాము
వంటసోడా
సెనగపిండి
బియ్యం పిండి రెండు స్పూన్లు
కారం తగినంత
ఉప్పు తగినంత
నీళ్లు
నూనె

తయారు చేసే విధానం:-

  • ఒక గిన్నలోకి శెనగ పిండి ఒక కప్పు తీసుకొని అందులో రెండు స్పూన్లు బియ్యం పిండి, వాము, ఉప్పు రుచికి సరిపడా, కారం తగినంత, చిటికెడు వంటసోడా వేసి నీళ్ళు పోసుకొని జారుడుగా కలుపుకోవాలి.
  • మరీ ఎక్కువ నీళ్ళు పోయకూడడు.
  • ఆలూ ని కడిగి సన్నగా స్లైస్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఎక్కువ సేపు అలానే పక్కన పెడితే నల్లగా మరతాయి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ లో నూనె పోసుకొని వేడి చేసి అందులో బజ్జీలు వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి.
  • అంతే రుచికరమైన క్రిస్పి ఆలూ బజ్జీలు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️