టొమాటో నిలవ పచ్చడి

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం నిలవ పచ్చడి లో టేస్టీ గా టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం.

tomato pickle

కావలసిన పదార్ధాలు:-

ఎర్రని టొమాటోలు ఒక కేజి
చింత పండు 50 గ్రాములు
కారం 150 గ్రాములు
ఉప్పు 100గ్రాములు
జీలకర్ర
జీలకర్రపొడి
పసుపు
ఆవ పొడి
మెంతి పొడి
నూనె
వెల్లుల్లి ఒక గడ్డ
కరిపాక్
సెనగపప్పు ఒక స్పూన్
మినపప్పు ఒక స్పూన్
ఎండు మిరపకాయలు నాలుగు
ఆవాలు

తయారు చేసే విధానం:-

  • ముందుగా టొమాటోలు కడిగి చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  • చింత పండు ననాపెట్టలి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో టొమాటో ముక్కలు వేసి ఉడికంచుకోవాలి.
  • పది నిమిషాల తర్వాత అందులో నానపెట్టిన చింత పండు వేసుకోవాలి. నీళ్లు వేయకూడదు.
  • మరో పది నిమిషాల తర్వాత అందులో ఒక నాలుగు స్పూన్ల నూనె వేసి కలపాలి.
  • ఇప్పుడు అందులో ఉప్పు, కారం,జీలకర్రపొడి,ఆవ పొడి, ఒక్కొకటి ఒక స్పూన్ , మెంతి పొడి అర స్పూన్ వేసుకోవాలి.
  • టొమాటో లో మొత్తం తేమ (నీళ్లు) పోయేవరకు వేయించాలి. అంటే మనం వేసుకున్న నూనె తేలే వరకు మంట తక్కువ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ లో నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి.
  • నిలవ పచ్చడి కాబట్టి ఎక్కువ వేసుకోవాలి.
  • నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు,కరివేపాకు, ఎండు మిర్చి, మినప్పప్పు, సెనగపప్పు,వెల్లుల్లి, పసుపు వేసి పచ్చడి లో కలుపుకోవాలి.
  • అంతే నిలవ టమాటో పచ్చడి రెడీ.


తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️