మురుకులు(జంతికలు)

హాయ్ ఫ్రెండ్స్,ఈరోజు మనం పిండి వంటలు చేసుకుందాం.అందులో ఇప్పుడు మురుకులు స్వీట్ హౌజ్ లో లాగా టేస్టీ గా ఎలా చేయాలో చూద్దాం.

janthikalu

కావలసిన పదార్ధాలు:-

బియ్యం 2 కేజీలు
మినపప్పు పావు కిలో
సెనగపప్పు పావు కిలో
జీలకర్ర రెండు స్పూన్లు
వాము రెండు స్పూన్లు
నూనె
ఉప్పు తగినంత
కారం తగినంత
జీలకర్ర
నువ్వులు 50 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్ట్
మురుకుల పాత్ర
నీళ్లు

తయారు చేసే విధానం:-

  • ముందుగా బియ్యం శుభ్రంగా చేసుకొని అందులో మినపప్పు, సెనగపప్పు, జీలకర్ర, వాము వేసి పిండి పట్టించుకోవాలి.
  • ఇప్పుడు పిండి ఒక వెడల్పాటి గిన్నెలో వేసి అందులో జీలకర్ర, ఉప్పు తగినంత, కారం తగినంత, నువ్వులు వేసి బాగా కలపాలి.
  • ఇప్పుడు ఒక పాత్రలో నీళ్ళు పోసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఏమైనా పిప్పి లాగా అడుగుకు ఉంటే తీసెయ్యాలి.
  • అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చిన్న చిన్న ముక్కలు మురుకులు చేసేటపుడు సరిగా చేయలేము.
  • ఇప్పుడు ఆ నీళ్ళు పిండిలో కొద్ది కొద్దిగా వేస్తూ పిండి కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి.
  • నూనె వేడయ్యాక మూరుకుల పాత్రలో పిండి పెట్టుకొని మూరుకులు నూనెలో వేసి ఎర్రగా కాల్చుకోవాలి.
  • అంతే రుచికరమైన వంటకం మురుకులు రెడీ.


తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️