హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.ఈరోజు మనం కాకరకాయ టొమాటో కర్రీ తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.
కావలసిన పదార్థాలు:-
కాకరకాయలు
టొమాటోలు ముక్కలు
ఉల్లిపాయ ముక్కలు
కొత్తిమీర
కరివేపాకు
ఎండు మిరపకాయలు
ఉప్పు తగినంత
నూనె
జీలకర్ర
జీలకర్రపొడి
ధనియాలపొడి
గరంమసాలా
కారం
నీళ్లు
పసుపు
అల్లం వెల్లుల్లి పేస్ట్
తయారు చేసే విధానం:-
- ముందు కాకరకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా చేతితో పిసకాలి.
- అప్పుడు అందులో నుండి రసం వస్తుంది. అది తీసేసి కాకరకాయ ముక్కలను మనం కూర వండుకోవాలి.
- లేకపోతే డైరెక్టుగా ఐన వండుకోవచ్చు.
- కాకపోతే కొంచెం చేదు ఉంటుంది. కొంచెం కూడా చేదు ఉండొద్దు. అనుకుంటే ఇలా ఉప్పు, పసుపు వేసి వండుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె వేసి కాగాక అందులో జీలకర్ర,ఎండు మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్ని ఒకదాని తరువాత మరొకటి వేసి ఫ్రై చేసుకోవాలి.
- బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కాకరకాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి.
- తర్వాత అందులో ఉప్పు తగినంత, కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి,గరంమసాలా , తగినన్ని నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి.
- చివరకు కొత్తిమీర వేసి దించేయాలి.
- అంతే రుచికరమైన కాకరకాయ టొమాటో కర్రీ రెడీ.
Post a Comment
If you have any doubts, Please let me know.