మామిడికాయ పప్పు

హాయ్ ఫ్రెండ్స్,

అందరికీ నమస్కారం.ఈరోజు మనం మామిడికాయ పప్పు తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

కావలసిన పదార్థాలు:-

మామిడికాయలు రెండు
కంది పప్పు ఒక కప్పు
కొత్తిమిర
నూనె
జీలకర్ర
ఎండుమిర్చి
కరివేపాకు
పసుపు
ఆవాలు
పచ్చిమిర్చి
ఉప్పు రుచికి సరిపడా
కారం
వెల్లుల్లి రెబ్బలు

తయారు చేసే విధానం:-

  • కంది పప్పు కడిగి కుక్కర్లో వేసి ఉడికంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె పోసుకొని వేడి చేసి అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి,కరివేపాకు,కొత్తిమీర అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
  • మామిడికాయ ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అందులో వెల్లుల్లి రెబ్బలు, మామిడి కాయ ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు అందులో ఉప్పు తగినంత, కారం తగినంత వేసుకొని ఉడికించిన పప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టీ రెండు నిమిషాలు ఉడికించాలి.
  • తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి ఒక పది నిమిషాలు పిండిని మరిగించాలి.
  • అంతే రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️