చామ గడ్డ ఫ్రై

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం చామ గడ్డ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.


chamadumpa fry

కావలసిన పదార్ధాలు:-

చామ గడ్డ
ఉల్లిపాయ ముక్కలు
పచ్చిమిర్చి
అల్లం వెల్లుల్లి పేస్ట్
పసుపు చిటికెడు 
ఉప్పు తగినంత 
కారం తగినంత 
కొత్తిమీర
నూనె
జీలకర్ర

తయారు చేసే విధానం:-

  • ముందుగా చామగడ్డ ను ఉడికించి పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  • స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె పోసుకొని చామగడ్డ లను ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ మీద కడాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలపాలి.
  • అందులో తగినంత ఉప్పు, కారం వేసి ఒక నిముషం తర్వాత అందులో చామగడ్డ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.
  • అంతే రుచికరమైన చామగడ్డ ఫ్రై రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️