హోటల్ స్టైల్ పూరి కాంబినేషన్ ఆలూ బెసన్ కర్రీ(పూరీ మసాలా)

హాయ్ ఫ్రెండ్స్,

అందరికీ నమస్కారం.ఈరోజు మనం ఆలూ బెసన్ కర్రీ తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

aloo besan curry

కావలసిన పదార్థాలు:-

ఉడికించిన ఆలూ
శెనగపిండి
ఉల్లిపాయ ముక్కలు
పచ్చిమిర్చి
అల్లం వెల్లుల్లి పేస్ట్
పసుపు చిటికెడు 
ఉప్పు తగినంత 
నూనె
జీలకర్ర
కరేపాకు
కొత్తిమీర
కారం కొద్దిగా
నీళ్లు తగినన్ని

తయారు చేసే విధానం:-`

  • ముందుగా స్టౌ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర,పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు చిటికెడు వేసుకోవాలి.
  • అవి ఫ్రై ఐన తర్వాత అందులో కరేపాకు,కొత్తిమీర, ఉడికించిన ఆలూ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఒక నిమిషం తరువాత అందులో తగినంత ఉప్పు,కారం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
  • తర్వాత శెనగపిండి రెండు స్పూన్లు తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలిపి పెట్టుకోవాలి.
  • వేసుకున్న నీళ్లు మరుగుతున్నప్పుడు శెనగపిండి నీళ్లను కర్రీ లో పోసి బాగా కలపాలి.
  • అలా ఐదు నిముషాలు ఉడికించుకోవాలి.
  • మనకు కావలసినంత చిక్కగా వచ్చే వరకు ఉడికించి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే రుచికరమైన వంటకం ఆలూ బెసన్ కర్రీ రెడీ.
  • తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️