హయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ టేస్టీ గా బెల్లం పాల తాలికలు ఎలా చేయాలో చూద్దాం.
బెల్లం పాల తాలికలు :-
బెల్లం పాల తాలికలు కూడా వినాయకునికి చాలా ఇష్టమైన ప్రసాదం . వినాయక చవితి సమయంలో ఇది కూడా ప్రసాదం గా సమర్పిస్తారు.అందరు తప్పకుండా వినాయకచవితి నాడు వినాయకుడికి నైవేద్యం గా పాల తాలికలను నివేదించండి. ఇది చాలా రుచిగా ఉంటుంది.పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం.తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి.
కావలసిన పదార్థాలు:-
నూనె లేదా నెయ్యి
పచ్చి కొబ్బరి తురుము రెండు స్పూన్లు
నీళ్ళు
బియ్యం పిండి ఒక కప్పు
బెల్లం
బాదం
కిస్మిస్
జీడిపప్పు
ఇలాచి పౌడర్ కొద్దిగా
మీకు నచ్చిన అన్ని డ్రై ఫ్రూట్ లు వేసుకోవచ్చు.
తయారు చేసే విధానం:-
- బెల్లం పాల తాలికలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు సిద్దం చేసుకోవాలి.
- స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకొని వేడిచేసుకోవాలి.నీళ్ళు వేడయ్యాక అందులో ఒక స్పూన్ నెయ్యి కానీ నునే కానీ వేసుకోవాలి.
- అలాగే మరుగుతున్న నీళ్ళలో ఒక స్పూన్ పంచదార వేసుకొని పంచదార కరిగే వరకు మరగాలి.
- మరిగిన తర్వాత బియ్యం పిండిని వేసి బాగా కలుపుకోవాలి.పిండిని కలుపుతూ చపాతీ పిండిలా అయ్యే వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- పిండిని చల్లార పెట్టి బాగా చేతితో మెత్తగా అయ్యే వరకు పిండిని కలిపి ముద్దలా చేసుకోవాలి.
- ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని అర చేతిలో వేసుకొని తాలికలు చేసుకోవాలి.
- తాలికలు మరీ సన్నగా కాకుండా మరీ లావు గా కాకుండా మీడియం సైజ్ లో చేసుకోవాలి.
- ఒక స్పూన్ పిండిని కొద్ది పాటి నీళ్లలో కలిపి పెట్టుకోవాలి.తాలికల పాయసం చిక్కగా అవ్వడానికి ఈ పిండిని కలుపుకోవాలి.
- అన్ని తయారు చేసుకొని కొద్దిగా వాటిపైన పొడి పిండి చల్లి పెట్టుకోవాలి.పొడి పిండి చల్లితే అన్ని అత్తుక్కోకుండ ఉంటాయి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి గిన్నె లో రెండు కప్పుల పాలు, ఒక కప్పు నీళ్ళు పోసి మరిగించాలి.
- ఇంకొక స్టౌవ్ మీద కడాయి లో ఒక కప్పు బెల్లం వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి కరిగించి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి.
- మరుగుతున్న పాలలో మనం చేసుకున్న తాలికలు వేసి మంట తక్కువ పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించాలి.
- ఆ తర్వాత నెమ్మదిగా కలపాలి.ఎక్కువగా కలిపితే తాలికలు విరిగిపోతాయి. జాగ్రత్తగా చేసుకోవాలి.
- తాలికలు ఉడకడానికి పది నిమిషాలు టైమ్ పడుతుంది.
- ఈ లోపు అందులో పచ్చి కొబ్బరి తురుము, ఇలాచి పౌడర్ వేసుకోవాలి.
- పది నిమిషాల తర్వాత నీళ్లలో కలిపి పెట్టుకున్న పిండిని కలుపుకొని రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
- చాలా చిక్కగా చేసుకోకూడదు. చల్లారితే పాల తాలికలు చిక్కగా కాబట్టి చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి.
- చివరగా డ్రై ఫ్రూట్ అన్ని నెయ్యి కానీ నూనె లో కానీ వేసి ఫ్రై చేసి పాయసంలో కలుపుకోవాలి.
- అంతే వినాయక చవితి స్పెషల్ బెల్లం పాల తాలికలు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.