హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ టేస్టీ గా రవ్వ ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూద్దాం.
రవ్వ ఉండ్రాళ్ళు :-
రవ్వ ఉండ్రాళ్ళు కూడా వినాయకునికి చాలాఇష్టమైన ప్రసాదం .ఇది అందరు తప్పకుండా వినాయకచవితి నాడు వినాయకుడికి నివేదిస్తారు. ఇది చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం.తప్పకుండ ట్రై చేసి టేస్ట్ చేయండి.
కావలసిన పదార్థాలు:-
నూనె
జీలకర్ర
అల్లం
నానపెట్టిన సెనగపప్పు
పచ్చి కొబ్బరి తురుము
నీళ్ళు
బియ్యం రవ్వ ఒక కప్పు
ఉప్పు
తయారు చేసే విధానం:-
- రవ్వ ఉండ్రాళ్ళు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు సిద్దం చేసుకోవాలి.
- సెనగపప్పు ను ఒక గంట సేపు నానపెట్టుకోవాలి.ఇప్పుడు ఆ పప్పును కొద్దిగా ఉడికించుకోవాలి .మరి మెత్తగా కాకుండా పప్పు విరిగేటట్టు ఉడికితే చాలు.
- బియ్యం రవ్వ షాపులలో దొరుకుతుంది .లేకపోతే మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు.
- దాని కోసం బియ్యం ఒక గంట సేపు నానపెట్టుకోవాలి.ఇప్పుడు ఆ బియ్యంలో నీళ్ళు తీసేసి ఒక బట్ట మిద అరపెట్టుకోవాలి.నీళ్ళు మొత్తం అరిపోవాలి.
- ఆరిన బియ్యాన్ని మిక్సిలో వేసి రవ్వ ల మిక్సి పట్టుకోవాలి.
- స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకొని వేడిచేసుకోవాలి.నీళ్ళు వేడయ్యాక అందులో ఒక స్పూన్ నెయ్యి కానీ నునే కానీ వేసుకోవాలి.
- ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్ళుపోసుకోవాలి.మరి ఎక్కువ నీళ్ళు పోసుకుంటే మెత్తగా అవుతుంది.
- నీళ్ళను మరిగించాలి.మరుగుతున్న నీళ్ళలో అర స్పూన్ జీలకర్ర , ఉడికించుకున్నసెనగపప్పు వేసుకోవాలి.
- ఇప్పుడు నీళ్ళలో బియ్యం రవ్వ వేసుకొని కలుపుతూ మొత్తం నీళ్ళు పోయి ఉప్మాల అయ్యే వరకు ఉడికించుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రవ్వ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.చల్లారిన తర్వాత చిన్న ఉండ్రాళ్ళు చేసుకోవాలి.సైజ్ మీకు నచ్చినంత చేసుకోవచ్చు.
- ఇప్పుడు స్టవ్ మీదఇడ్లీ కుక్కర్ పెట్టి నీళ్ళు పోసి వేడిచేసుకోవాలి.తర్వాత ఇడ్లీ ప్లేట్స్ లో మనం చేసుకున్న ఉండ్రాళ్ళను చక్కగా పెట్టుకోవాలి.
- ఇడ్లీ ప్లేట్స్ లో పెట్టుకున్న తర్వాత కుక్కర్ లో పెట్టుకొని ఒక పది నిముషాలు ఉడికించుకోవాలి.
- అంతే వినాయక చవితి స్పెషల్ రవ్వ ఉండ్రాళ్ళు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: వినాయక చవితి స్పెషల్ మోదకాలు/Modakalu
Post a Comment
If you have any doubts, Please let me know.