హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ టేస్టీ గా మోదకాలు ఎలా చేయాలో చూద్దాం.
మోదకాలు :-
మోదకాలు ఇది కూడా వినాయకునికి చాలా ఇష్టమైన ప్రసాదం .ఇది ఎక్కువగా నార్త్ ఇండియా లో అందరు తప్పకుండా వినాయకచవితి నాడు వినాయకుడికి నివేదిస్తారు. ఇది చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.ఇది బెల్లంతో చేసుకోవచ్చు.ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. తప్పకుండ ట్రై చేసి టేస్ట్ చేయండి.
కావలసిన పదార్థాలు:-
బియ్యం పిండి ఒక కప్పు
బెల్లం ఒక కప్పు
నెయ్యి ఒక స్పూన్
ఎండు కొబ్బరి తురుము
నీళ్ళు ఒక కప్పు
సెనగపప్పు ఒక కప్పు
ఇలాచి పౌడర్
చిటికెడు ఉప్పు
తయారు చేసే విదానం:-
- మోదకాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు సిద్దం చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి.
- నీళ్లు బెల్లం తడిసెల పోసుకుంటే చాలు ఎక్కువగా పోసుకుంటే జారుడుగా అవుతుంది.
- బెల్లం కరిగిన తరువాత అందులో పొడి చేసుకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి.
- అందులో ఒక సగం చెంచా ఇలాచి పౌడర్ వేసుకోవాలి.
- ముద్దగా అయ్యే వరకు ఉడికించి స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టీ చల్లారనివ్వాలి.
- కొబ్బరి, బెల్లం మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకొని వేడిచేసుకోవాలి.
- నీళ్ళు వేడయ్యాక అందులో ఒక స్పూన్ నెయ్యి కానీ నునే కానీ వేసుకోవాలి.
- అలాగే మరుగుతున్న నీళ్ళలో చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి.
- మరిగిన తర్వాత బియ్యం పిండిని వేసి బాగా కలుపుకోవాలి.పిండిని కలుపుతూ చపాతీ పిండిలా అయ్యే వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- పిండిని కొంచెం వేడిగా ఉన్నప్పుడే బాగా చేతితో మెత్తగా అయ్యే వరకు పిండిని కలిపి ముద్దలా చేసుకోవాలి.
- కొద్దిగా పిండి నీ తీసుకుని అర చేతిలో వేసుకొని ఒక చిన్న పూరీలా చేసుకొని అందులో కొబ్బరి బెల్లం మిశ్రమం పెట్టీ మోదకాలు చేసుకోవాలి.
- మోదకాలు చేయడానికి మోదకాల మిషన్లు కూడా ఉంటాయి. చేతితో ఐన చేసుకోవచ్చు.
- అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టౌవ్ మీద కుక్కర్ పెట్టుకొని నీళ్లు వేడి చేసుకొని పెట్టుకోవాలి.
- మోదకాలు ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని కుక్కర్లో పెట్టీ ఆవిరి మీద పది నిమిషాలు ఉడికించాలి.
- అంతే వినాయక చవితి స్పెషల్ టేస్టీ గా మోదకాలు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి .
Also read: వినాయక చవితి స్పెషల్ బెల్లం పాల తాలికలు/Bellam pala thalikalu
Post a Comment
If you have any doubts, Please let me know.