వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం /undralla payasam

హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్  టేస్టీ గాఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూద్దాం.


ఉండ్రాళ్ళ పాయసం :-

ఉండ్రాళ్ళ పాయసం ఇది వినాయకునికి చాలాఇష్టమైన ప్రసాదం .ఇది అందరు తప్పకుండా వినాయకచవితి నాడు వినాయకుడికి నివేదిస్తారు. ఇది చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.ఇది బెల్లంతో కానీ పంచదారతో కానీ చేసుకోవచ్చు.ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం.తప్పకుండ ట్రై చేసి టేస్ట్ చేయండి.


bellam undraluu

కావలసిన పదార్థాలు:-

బియ్యం పిండి ఒక కప్పు

పంచదార

బెల్లం

నెయ్యి

జీడిపప్పు

కిస్మిస్

కొబ్బరి ముక్కలు

పాలు

నీళ్ళు ఒకటిన్నరకప్పు


undralla payasam

తయారు చేసే విదానం:-

  • ఉండ్రాళ్ళ పాయసం చేసుకోవడానికి కావలసిన పదార్థాలు సిద్దం చేసుకోవాలి.

  • స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకొని వేడిచేసుకోవాలి.నీళ్ళు వేడయ్యాక అందులో ఒక స్పూన్ నెయ్యి కానీ నునే కానీ వేసుకోవాలి.

  • అలాగే మరుగుతున్న నీళ్ళలో ఒక స్పూన్ పంచదార వేసుకొని పంచదార కరిగే వరకు మరగాలి.

  • మరిగిన తర్వాత బియ్యం పిండిని వేసి బాగా కలుపుకోవాలి.పిండిని కలుపుతూ చపాతీ పిండిలా అయ్యే వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

  • పిండిని చల్లార పెట్టి బాగా చేతితో మేతగా అయ్యే వరకు పిండిని కలిపి ముద్దలా చేసుకోవాలి.

  • ఇప్పుడు చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేసుకోవాలి.ఉండ్రాళ్ళు గుండ్రంగా చేసుకోవాలి.పై నుండి పగుళ్ళు రాకుండా చేసుకోవాలి.

  • పగుళ్ళు  వస్తే ఉండ్రాళ్ళు  పగులుతాయి.కాబట్టి జాగ్రత్తగాచేసుకోవాలి.చేసుకున్న ఉండ్రాళ్ళు పక్కన పెట్టుకోవాలి.

  • ఒక చిన్న కడాయి తీసుకోని అందులో కొద్దిగా నెయ్యి కానీ నునే కానీ వేసి వేడి చేసుకొని జీడిపప్పు ,కిస్మిస్ లని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.

  • ఆ తరువాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మూడు కప్పుల నీళ్ళు పోసుకొని వేడి చేసుకోవాలి.అదే నీళ్ళలో ఒక కప్పు బెల్లం కానీ ఒక కప్పు పంచదార కానీ వేసుకొని కరిగే వరకు బాగా కలుపుతూ ఉండాలి.

  • ఈ లోపు ఇంకొక స్టవ్ మిద ఒక కప్పు పాలు వేడి చేసి కొద్దిగా చల్లార్చుకోవాలి.

  • బెల్లం పూర్తిగా కరిగాక అందులో మనం తయారు చేసుకొని పెట్టుకున్న ఉండ్రాళ్ళు వేసుకొని కలుపుకోవాలి.

  • ఉండ్రాళ్ళు ఉన్దికేవరకు ఉడికించుకోవాలి.ఇప్పుడు ఒక స్పూన్ బియ్యం పిండిని కొద్దిగా నీళ్ళలో కలిపి పాయసంలో పోసుకోవాలి.

  • ఇలా చేయడం వాళ్ళ పాయసం చిక్కగా అవుతుంది.కాసేపటికి కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు పోసుకొని కలుపుకోవాలి.

  • ఉడుకుతున్న పాయసంలో ఫ్రైచేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

  • అంతే వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాల పాయసం రెడీ .

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️