హాయ్ ఫ్రెండ్స్ ,
ఈరోజు సగ్గుబియ్యం తో దోసలు ఎలా చేయాలో నేర్చుకుందాం.
దోశ:-
సౌత్ ఇండియాలో అందరు ఎక్కువగా చేసుకునే ఇష్టమైన అల్పాహారం. ఇది అందరికి అత్యంత ఇష్టమైన టిఫిన్.ఇవి ఉడిపి హోటళ్ళలో ఎక్కువగా చేస్తుంటారు. దోసెలతో సహా పచ్చడి, కూర కూడా ఇస్తుంటారు. దీనిలో ముఖ్యమైన పదార్థం మినుములు.
కావలసిన పదార్థాలు :-
బియ్యం- రెండు కప్పులు
సగ్గుబియ్యం- కప్పు
అటుకులు అరకప్పు
మినప్పప్పు- పావుకప్పు
మెంతులు- పావు టీస్పూన్
ఉప్పు కొద్దిగా
చిటికెడు వంట సోడా
తయారు చేసే విధానం:-
- దోసలు చేసుకోవడానికి కావలసినవన్నీ ముందుగా కడిగి వేరు వేరుగా నానపెట్టుకోవాలి.
- బియ్యం, మినప్పప్పు, మెంతులు, అటుకులు, సగ్గుబియ్యాన్ని, మెంతులు అయిదు గంటలపాటు నానపెట్టుకోవాలి.
- ఆ తర్వాత అన్ని వేరు వేరుగా మిక్సిలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- పిండిని ఒక గిన్నెలోకి తీసుకోని అన్ని చక్కగా కలిసేలా కలుపుకోవాలి.పిండిలో చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
- సోడా కావాలంటే వేసుకోవాలి.లేకపోతే మనేయోచ్చు .
- ఈ పిండిని రాత్రంతా అలాగే ఉంచాలి.రాత్రంతా ఉండనివ్వకపోయిన ఒక నలుగు గంటలు ఉన్న సరిపోతుంది.
- తర్వాత తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
- స్టవ్ వెలిగించి పెనం పెట్టి, అది వేడెక్కాక నూనె పోసి దోసె వేయాలి. ఈ దోసెలు ఎంతో మృదువుగా రుచిగా ఉంటాయి.
- దోస ని ఎర్రగా కాల్చుకోవాలి.దోస కి పల్లి చట్నీ కానీ ,టమాటో చట్నీ తో తింటే చాల రుచిగా ఉంటుంది.
- అంతే రుచికరమైన సగ్గుబియ్యం దోస రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: ఉప్మారవ్వ అప్పడాలు/ upma ravva appadalu
Post a Comment
If you have any doubts, Please let me know.