ఉప్మారవ్వ అప్పడాలు/ upma ravva appadalu

హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా గ్రీన్ మసాలా పూరీలు ఎలా చేయాలో చూద్దాం.


అప్పడాలు :-

సాదారణంగా మనం ఎక్కువగా పప్పు చారులోకి అప్పడాలు తింటాం.వేసవి కాలంలో మనం ఎక్కువగా చేసుకుంటాం.రకరకాల అప్పడాలు మనం చేసుకుంటాం. ఈరోజు అందులో రవ్వ అప్పడాలు ఎలా చేయాలో నేర్చుకుందాం.

ravva appadalu


కావలసిన పదార్థాలు:-

ఉప్మా రవ్వ ఒక గ్లాసు

తగినంత ఉప్పు

నువ్వులు రెండు స్పూన్లు

జీలకర్ర ఒక స్పూన్

వాము కొద్దిగా 

నీళ్ళు 

కొద్దిగా వంట సోడా

bombay ravva vadiyalu

తయారు చేసే విదానం:-


  • అప్పడాలు చేయడానికి ముందుగా కావలసినవన్నీసిద్దం చేసుకోవాలి.

  • ముందుగా ఉప్మా రవ్వను ఒక గ్లాసుతో కొలచి పెట్టుకోవాలి. 

  • ఒక గ్లాసు ఉప్మాకు ఎనిమిది గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 

  • స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో ఎనిమిది గ్లాసులు నీళ్లు పోసుకోవాలి.

  • నీళ్లను బాగా మసిలే దాకావేడి చేసి, దాంట్లో తగినంత ఉప్పు, నువ్వులు, వాము వేసి కాసేపు మరిగించాలి.

  • తర్వాత ఉప్మా రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. అలా, పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

  • కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.దోసల పిండిలా అయ్యే వరకు చేసుకోవాలి.

  • తర్వాత వేరొక గిన్నెలో దాన్ని తీసుకొని ఎండగా ఉన్న స్థలంలో ఆ పిండిని గరిటెతో తీసుకొని ఫాలితిన్ కవర్ పైన కొద్ది కొద్దిగా పలుచగా , గుండ్రంగా ఒక్కొక్కటిగా కవర్ పైన కొంచెం కొంచెం దూరంలో  వేయాలి.

  • అలా ఒకరోజు ఎండలో ఉంచాక  కవర్ పై నుండి తీసి అన్ని ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి.

  • మరొక రోజు ఎండలో ఎండపెట్టుకోవాలి.

అంతే  వేయించడానికి సిద్ధంగా ఉన్న ఆప్పడాలు రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

upma ravva vadiyalu

Also read: జీడిపప్పు బిస్కెట్లు (cashew biscuits)

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️